లక్ష్మాపురంలో ఉచిత ప్రాథమిక కంటి పరీక్షలు

లక్ష్మాపురంలో ఉచిత ప్రాథమిక కంటి పరీక్షలు

 

విశ్వంభర ,రామన్నపేట జూలై 23 :  - యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో మంగళవారం రోజు గ్రామపంచాయతీ కార్యాలయంలో శంకర కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ (శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ )మరియు జిల్లా అంతత్వ నివారణ సంస్థ& సురేఖ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ పీర్జాదిగూడ హైదరాబాద్ వారి  ఆధ్వర్యంలో కంప్యూటర్ చే ఉచిత ప్రాథమిక  కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 60మంది హాజరు కావడం జరిగింది. ఈ శిబిరంలో 09 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగింది. వీరికి త్వరలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని క్యాంపు నిర్వహకులు డాక్టర్ టి . ఉమామహేశ్వర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది శ్రీకళ, కోఆర్డినేటర్ బాలరాజు, ఎండి మాజీద్ మరియు తాజా మాజీ గ్రామ సర్పంచ్ ఉప్పు ప్రకాష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పి. రమేష్ ,కారోబార్ మెండే వెంకటేష్ ,గ్రామ పెద్దలు నీల మురళి, ఆరూరి పాండు, దేవిరెడ్డి సత్తిరెడ్డి మరియు గ్రామప్రజలు  తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-07-23 at 17.41.12_3d4e0dba - Copy