మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.5తీవ్రత
మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణిపూర్‌లోని చందేల్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.28గంటలకు భూమి కంపించింది.
మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణిపూర్‌లోని చందేల్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.28గంటలకు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచిబయటకు పరుగులుతీశారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం 77కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ఎన్‌సీఎస్ గుర్తించింది. ఇది ఆక్షాంశం 23.9ఎన్, రేఖాంశం 94.10ఈ వద్ద జరిగిందని పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. భూకంప తీవ్రత స్వల్పంగానే ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.