టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

 టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకృష్ణదేవరాయలు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందారు.

ఈ ఏడాది జనవరి 23న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి మరోసారి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంచి గౌరవం దక్కిందని, నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తన కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ రుణపడి ఉంటానన్నారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts