పండుగలు సాంప్రధాయానికి ప్రతీకలు: సెక్రటరీ సుదర్శన్ రెడ్డి.
On
విశ్వంబర, ఎల్బీనగర్ ;పండుగలు సాంప్రధాయానికి ప్రతీకలు అని శివాని మహిళా కళాశాల సెక్రెటరీ, కరెస్పాండెంట్ వేధిరే సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తపేటలోని కళాశాల లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి వేసిన భోగి మంటలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతి పండుగను విద్యార్థినులకు తెలియజేసే విధంగా నిర్వహిస్తుంటామని తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.