పార్టీ కార్యాలయం పై దాడి సిగ్గుచేటు: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

పార్టీ కార్యాలయం పై దాడి సిగ్గుచేటు: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

విశ్వంభర, ఎల్బీనగర్ ;భువనగిరి లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మహేశ్వరం నియోజకవర్గ బి ఆర్ ఎస్  ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ అన్నారు. శనివారము ఆయన మాట్లాడుతూ భువనగిరి బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ చేసిన దాడి దుర్మార్గం అని తెలంగాణ లో 3 డి పాలన లో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలు విధ్వంసం కొనసాగుతున్నది అని అన్నారు.ఒక వైపు హైడ్రా, మూసి పేర పేద ప్రజలు ఇళ్లు విధ్వంసం చేస్తుంటే, బాధితుల పక్షాన పోరాడుతున్న బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల పై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు.హింస ను ప్రేరేపించి రాష్ట్రం లో శాంతి భద్రతల సమస్యగా మార్చాలనే ట్రాప్ లో బి ఆర్ ఎస్ పడదు అని, మీరు ఎన్ని దాడులు చేసినా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు అయ్యేవరకు పోరాడుతాం అని హెచ్చరించారు. రాజకీయ విమర్శలకు హుందాగా సమాధానం చెప్పాలని దాడులకు దిగితే ప్రజలు క్షమించరుఅని , పార్టీ కార్యాలయం పై దాడులు చేస్తే పోలీస్ లు మౌనం వహించడం కాంగ్రెస్ నిర్బంధ పాలనకు సంకేతం  అని అన్నారు.ఇందిరమ్మ రాజ్యం పేర విధ్వంసాలు, కూల్చివేతలు, ఎగవేతలు,అడిగితే అరెస్టులు, దాడులు ఈ రేస్ కేసులు, మీ దాడులకు భయపడం ప్రజాక్షేత్రంలో లో మీ దుర్మార్గాన్ని ఎండగడతాం అని అన్నారు.

Tags: