చిక్కడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ 

 చిక్కడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ 

పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ  శైలజ రామయ్యర్,  వెంకటేశ్వర స్వామి దేవాలయం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ 
 
విశిష్ట దేవాలయాలలో  పద్మశాలీల పట్టు వస్త్రాల సమర్పణ కమిటీ 

విశ్వంభర, చిక్కడపల్లి : విశిష్ట దేవాలయాలలో  పద్మశాలీల పట్టు వస్త్రాల సమర్పణ కమిటీ వారు నిర్మించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ  శైలజ రామయ్యర్,  వెంకటేశ్వర స్వామి దేవాలయం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణతో కలిసి  చిక్కడపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఎస్ ఎస్  జయరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.  గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత, మేళా కమిటీ అధ్యక్షులు చింతగింజి జానయ్య , తెలంగాణ పద్మశాలి మహిళా అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ , పెండం జగదీష్,  మార్గం అమర్ మొదలైన వారు పాల్గొన్నారు.  అనంతరం  దేవాలయ ఈవో అన్నపూర్ణమ్మ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చేయించి అర్చకులచే ఆశీర్వాదం ,  తీర్థప్రసాదాలు అందజేశారు.   
 
 
 

Tags: