ఎమ్మెల్సీ రమణ కు శుభాకాంక్షలు తెలిపిన కళ్లేపల్లి రాజు నేత
On
విశ్వంభర, హైదరాబాద్ : నేటితో రాజకీయ క్షేత్రంలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఎమ్మెల్సీ ఎల్ రమణకు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం , ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగిత్యాల నుండి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా (1994), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఖాది బోర్డు చైర్మన్ గా, చేనేత జౌలి శాఖ మంత్రిగా (1994-1996), లోక్ సభ సభ్యునిగా(1996-1998), తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడుగా (2015-2021) ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాసనమండలి(2021)సభ్యునిగా వివిధ పదవులను చేపట్టి ఆ పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు అని ఆయన అన్నారు.