సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలి: చిలుక మధుర ఉపేందర్ రెడ్డి
సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో సంతోషాన్ని, వెలుగులు నింపాలి అని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులూ చిలుక మధుర ఉపేందర్ రెడ్డి అన్నారు . శనివారం రామకృష్ణాపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ , శ్రీ రామకృష్ణపురం మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల (రంగవల్లి) ఫోటిలకు
ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి లు ముఖ్యఅతిథిలుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు .వారు మాట్లాడుతూ పండుగలను ప్రతి ఒక్కరు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు అని అన్నారు. అనంతరం ప్రథమ బహుమతి విజేత వైశాలి కి రూ .10,000 విలువైన వెండి, రెండవ బహుమతి విజేత కావ్య కు రూ .5000 విలువైన వెండి, మూడవ బహుమతి విజేత సాయి సునీత 3000 విలువైన పట్టు చేర ను అందచేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయికుమార్ , సెక్రటరీ శ్యాంసుందర్ రావు ,కోశాధికారి గట్టు హరీష్ , జాయింట్ సెక్రటరీ హేమాద్రి శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్ , మహిళా మండలి సభ్యులు విద్య రెడ్డి , కల్పన, లలిత , జ్యోతి , శిల్ప అజయ్, ప్రియాంక, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.