ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో ఉపయోగం: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.
On
విశ్వంభర, మీర్ పెట్ ;ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో ఉపయోగం అని మాజీమంత్రి,మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 9 వ డివిజన్ నంది హిల్స్ కి చెందిన పుష్పలత రూ .12000, విష్ణు మూర్తి 33,000, లక్ష్మమ్మ 28,500 లకి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిది ఎంతో ఉపయోగ పడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కామేష్ రెడ్డి , 9 వ డివిజన్ ఇన్చార్జి రామిడి నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి , తన్నీరు రంగా రావు , రమేష్, శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.