ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం
చేనేత కార్మికులకు రూ .163 కోట్లు కేటాయింపు
విశ్వంభర, ఎల్బీనగర్ : చేనేత కార్మికులకు తెలంగాణ నేతన్న పొదుపు పథకం, తెలంగాణ నేతన్న భరోసా పథకం, తెలంగాణ నేతన్న భద్రతా పథకం, ట్రిప్ట్ ఫండ్ ప్రకటించి రూ .163 కేటాయించినందుకు గాను గాంధీభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శ్రీరామ కృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నం పెట్టే రైతన్న , నేతన్నలకు రుణమాఫీ ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దక్కుుతుందన్నారు. చేనేతకు ప్రత్యేక ముద్ర సిల్క్ వస్త్రాలకు సిల్క్ మార్క్, చేనేత వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్పును ప్రత్యేకంగా ముద్రణ రూపొందించిన తొలి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు . ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు రవికుమార్, తలాటి రమేష్ , జెల్ల జగన్నాథం , భోగ జగదీష్, సంఘం రమేష్, నర్సింగ్, కళ్యాణ్, ప్రవీణ్ కుమార్,శివ తదితరులు పాల్గొన్నారు.