క్రీడల వల్ల విద్యార్థులలో స్నేహభావం పెరుగుతుంది : డా. కోడి శ్రీనివాసులు
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
విశ్వంభర, చండూర్ : విద్యార్థులకు క్రీడలు ఆత్మస్థైర్యాన్ని నింపుతాయని, క్రీడల వల్ల విద్యార్థులలో స్నేహభావం పెరుగుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు మరియు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ హైస్కూల్లో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల, మత బేధాలు లేకుండా విద్యార్థులు స్నేహభావంతో మెలగాలని, ఇలాంటి క్రీడల పోటీలలో తరచూ పాల్గొనాలని అన్నారు, విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి డివైఎఫ్ఐ మంచి కృషి చేస్తుందని కొనియాడారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి మాట్లాడుతూ ముగ్గుల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు, భవిష్యత్తులో డివైఎఫ్ఐ నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, విద్యార్థులు మంచి మార్గంలో నడిచి తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరును తేవాలని కోరారు. అనంతరం పోటీలలో పాల్గొన్న విద్యార్థులందరికీ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది, కార్యక్రమము నిర్వహణకు అనుమతి ఇచ్చిన గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులును, డైరెక్టర్ సరికొండ వెంకన్నను డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ డివిజన్ నాయకులు పగిళ్ల మధు, పగిళ్ల పరమేష్, మండల ఉపాధ్యక్షులు కట్ట వెంకన్న, కట్ట లింగస్వామి, మండల నాయకులు పగిళ్ల సాయి తేజ, గాంధీజీ హై స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ మూర్తి, పులిపాటి రాధిక, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.