పండుగలు సాంప్రధాయానికి ప్రతీకలు: : ఎ జి ఎం హేమాంబర్.
On
విశ్వంబర, ఎల్బీనగర్ ;పండుగలు సాంప్రధాయానికి ప్రతీకలు అని నారాయణ పాఠశాల ఎ జి ఎం హేమాంబర్ అన్నారు. శుక్రవారం చింతలకుంట శాఖ
నారాయణ పాఠశాల లో సంక్రాంతి వేడుకల్ని చాలా ఆహ్లాదకరంగా జరిపారు . అందమైన రంగవల్లులు, భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో విద్యార్థులు, పల్లె వాతావరణ అలంకరణలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది. తెలుగువారు మూడు రోజుల పాటు జరుపుకొనే భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను, మన సంస్కృతీ సంప్రదాయలను విద్యార్థులు తెలుసుకొని, ఆనందించి, ఆచరించే విధంగా కార్యక్రమాన్ని జరుపటం జరిగింది. ఈ కార్యక్రమం లో మార్కెటింగ్ ఆర్ ఐ రవి ప్రసాద్ , కో ఆర్డినేటర్ గాయత్రి , ప్రిన్సిపాల్ రాజ రాజేశ్వరి దేవి , ఎ ఒ ఫణి , సిబ్బంది పాల్గొన్నారు.