జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం
మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు.
జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా అంటూ ఎగతాలి చేస్తూ కామెంట్లు చేశారు. ఇంకొందరేమో గుడ్డు పగిలింది అంటూ కామెంట్లు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే జగన్ మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడే జగన్ ను ఇలా ఉంటే.. ఇక మున్ముందు జగన్ ను ఇంకెలా టార్గెట్ చేస్తారో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.