‘థాంక్యూ అమ్మా..’ ఎన్టీఆర్ ట్వీట్‌కు బాబు స్పందన

‘థాంక్యూ అమ్మా..’ ఎన్టీఆర్ ట్వీట్‌కు బాబు స్పందన

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తారక్ ట్వీట్‌కు చంద్రబాబు నాయుడు స్పందించారు.

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తారక్ ట్వీట్‌కు చంద్రబాబు నాయుడు స్పందించారు. 'థాంక్యూ వెరీ మ‌చ్ అమ్మ' అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బ‌దులిచ్చారు. అదేవిధంగా త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేశ్‌బాబు, ఇత‌ర రాజకీయ‌, సినీ ప్ర‌ముఖుల‌కు సైతం ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు చంద్రబాబు. 

ఎన్టీఆర్ బుధవారం తన ట్వీట్‌లో "ప్రియమైన చంద్రబాబు మామయ్యకి.. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్‌కు నా శుభాకాంక్షలు" ని పేర్కొన్నాడు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఇక ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విష‌యం తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా, అందులో టీడీపీ సొంతంగా 135 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా 16 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ వశమయ్యాయి. దీంతో వైసీపీ 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. అటు జనసేన, బీజేపీ కూడా దూకుడు ప్రదర్శించాయి. జనసేన పోటీ చేసిన‌ 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజ‌య‌ఢంకా మోగించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Related Posts