ఫ్రైడే డ్రై డే ప్రోగ్రాం లో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం

WhatsApp Image 2024-07-19 at 14.15.40_409caa38

విశ్వంభర, ఆమనగల్లు, జూలై 19 : - ఆమనగల్లు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 11 వ వార్డు ఆదర్శ నగర్ కాలనీ లో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాలనీలో కలుషిత నీరు ఉండకుండా స్వయంగా పర్యవేక్షించారు, పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొవాలని సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవలని అందరూ ఆరోగ్య విషయంలో దోమల బారిన పడకుండా శ్రద్ద వహించి జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ వసంత కాలనీ  వాసులకు సూచించారు.

Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ

WhatsApp Image 2024-07-19 at 14.15.40_8efcad73 ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్,  వైస్ చైర్మన్ దుర్గయ్య, కమిషనర్ వసంత, కౌన్సిలర్ యాదమ్మ  శ్రీశైలం, చెన్న కేశవులు, బైకని శ్రీశైలం పందుల మత్తయ్య రంజిత్, రామకృష్ణ, మున్సిపాలిటీ సిబ్బంది , కాలనీ వాసులు పాల్గొన్నారు