రవీంద్రభారతిలో జరిగే మాదిగల దండోరా రజతోత్సవాలకు వేలాదిగా తరలిరండి

"ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు కుమ్మరి కుంట్ల గణేష్ మాదిగ"

 

WhatsApp Image 2024-07-06 at 5.26.42 PM

Read More మహాపడిపూజ మహోత్సవంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

విశ్వంభర ,ఆత్మకూరు (ఎం) జూలై 06 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత తొలి ప్రధాని సమసమాజ స్థాపనకై కృషిచేసిన కృషిపలుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి  దండోరా రజతోత్సవాల కరపత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు కుమ్మరి కుంట్ల గణేష్ మాట్లాడుతూ చాటింపులకు పెళ్లిళ్లకు చావులకు ఫలితం పరిమితమైన మాదిగ హక్కుల ఉద్యమం మొదలైన నుండి 30 సంవత్సరాలు రజతోత్సవాలు జరుపుకుంటున్న నా మాదిగ జాతి శబ్దం నా డబ్బుకు ఘనమైనటువంటి రజతోత్సవాలు జరుపుకోవడానికి ప్రతి పల్లె నుండి ఢిల్లీ వరకు 30 వసంతాలు(7 జులై 1994)పూర్తి చేసుకున్న మన మహా శబ్దం డప్పుకు మాదిగ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యతగా జులై 7న దండోరా పుట్టిన సంబరాలను అంబరాలకు తాకేటట్లుగా ప్రతి మాదిగ ఇంట్లో పండుగ జరపాలి. పదునైన ఆరే పని కత్తి పాండ్రాయి పని గూటం తోలు లంద మన వృత్తిలో భాగమైన ప్రతి పనిముట్టును జూలై 7 తారీఖున గుర్తుచేసుకొని ఘనంగా సత్కరించుకుందాము. ఆత్మకూరు(ఎం) మండలం నుండి వేలాదిగా రాజతోత్సవాలకు తరలిరావాలని కుమ్మరి కుంట్ల గణేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వస్తుపుల స్వామి మాదిగ ఆత్మకూరు(ఎం) మండల ఇంచార్జ్ మేడి శ్రీనివాస్ మాదిగ మాజీ మండల అధ్యక్షుడు పంది రవీందర్ మాదిగ సంఘ పాక స్వామి మాదిగ ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు కదిరే నవీన్ మాదిగ మండల నాయకులు వస్తువుల  ఎల్లయ్య మాదిగ మేడి చంద్రయ్య మాదిగ మేడి బాలకృష్ణ మాదిగ కదిరే దశరథ మాదిగ గట్టు శంకర్ మాదిగ మేడి నర్సింగరావు మాదిగ కొమ్ము ముత్తయ్య మాదిగ తదిరులు పాల్గొన్నారు.