మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం కనబడలేదు

రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను నిరాశ పరిచింది: ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్. 
 

WhatsApp Image 2024-07-25 at 17.42.29_0425b86f

విశ్వంబరా, ఎల్బీనగర్  : - మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం ఎక్కడ కనబడలేదని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను నిరాశపరిచిందని ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ
 ఉద్యోగ సంఘాలు  కరువు భత్యం 5 విడుతలు విడుదల చేయాలని చేసిన డిమాండ్ ను పట్టించుకోక పోవడం అన్యాయం  అని అన్నారు.
అక్టోబర్ 24 వరకు పి ఆర్ సి గడువు పూర్తి అవుతుంది అని, 2024 లో పి ఆర్ సి ఇవ్వమని బడ్జెట్ స్పష్టం చేసిన ఎలాంటి కేటాయింపులు లేవు అని అన్నారు.కనీసం మద్యంతర భృతి ప్రస్తావన కూడా తీసుకురాలేదన్నారు.  31/4/24 నుండి ప్రతి నెల వందలాది ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు వారికి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ఉద్యోగుల కు రావలిసిన నిధులు 5000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అని, అధికారం లో కి రాగానే త్జక్షణ చెల్లింపు చేస్తామని హామీ ఇచ్చి కేటాయింపు లు లేకపోవడం ఉద్యోగులను మోసం చేయడమే అని అన్నారు.
2 లక్షల ఉద్యోగులను నియమిస్తామని చెప్పి ఎలాంటి కేటాయింపు లు చేయకపోవడం  కాంగ్రెస్ పార్టీ కి నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ తెలిసిపోయింది అని అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు, ఈ హెచ్ ఎస్ బలోపేతం చేస్తాం అని చెప్పి ఎలాంటి ప్రస్తావన లేదు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ 
పై ఎలాంటి హామీ లేదు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఊసే లేదు అని అన్నారు.

 

Read More TPCC అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్