అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన PDSU విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి!
విశ్వంభర ,జూలై 24 : - బడ్జెట్ లో విద్యా రంగానికి 30% నిధుల్ని కేటాయించాలని, అన్ని యూనివర్సిటీ లకు వీసీ లను నియమాకం చేయాలని, అన్ని రకాల పెండింగ్ బకాయులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్స్ పై ఈ రోజు PDSU రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ముట్టడి కి పిలుపు నిచ్చింది. అసెంబ్లీ నడుస్తుండగానే, దాని ఎదుట pdsu నాయకులు, కార్యకర్తలు జెండాలతో, కరపత్రాలతో ఒక్కపెట్టున ఆందోళన కు దిగారు. ఈ ప్రజాస్వామిక నిరసనను సహించలేని పోలీసులు విద్యార్థులపై దాడి చేస్తూ, దొరికిన వారిని దొరికినట్లు గా అరెస్ట్ చేసి, బండ్లగూడ, కoచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో PDSU రాష్ట్ర అధ్యక్షులు బోనగిరి మధు, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, ఉపాధ్యక్షులు నవీన్, ప్రణయ్ లతో పాటు ప్రవీణ్, శ్యామ్, నాగరాజు, యశ్వంత్, మహేష్, విజయ్ తదితర 30 మంది ఉన్నారు.
గత అర్ధరాత్రి నుండే ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం పోలీసులు సంగారెడ్డి జిల్లాలో సురేష్, నర్సింహారెడ్డి, సందీప్ లతో పాటు మొత్తం 12 మందిని ముందస్తుగా సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు లలో అరెస్ట్ చేశారు.
అలాగే హైదరాబాద్ లో ఉపాధ్యక్షలు సైదులు ను తెల్లవారు జామున ఇంటి వద్ద అరెస్ట్ చేసి అంబర్పేట్ స్టేషన్ లో ఉంచారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా, కేవలం నిర్భంధం, అణచివేత ద్వారా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ కోరుతున్నది. అరెస్ట్ చేసిన విద్యార్ధి నాయకులను, కార్యకర్తల ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
కె. గోవర్దన్
రాష్ట్ర నాయకులు
సిపిఐ ( ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ
24-7-2024