అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు

...రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
...బిజెపి, బిజెవైఎం నాయకుల అరెస్టులు సిగ్గుచేటు
...బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు
... బిజెపి మండల అధ్యక్షులు శివర్ల రమేష్

WhatsApp Image 2024-07-25 at 15.48.54_e631ddf2

విశ్వంభర చింతపల్లి జూలై 25 : - నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నిరుద్యోగ భృతి చెల్లించి, గ్రూప్-2 పోస్టులు పెంచి, గ్రూప్-1లో 1:100 క్వాలిఫై చేయాలని భారతీయ జనతా యువమోర్చా ఓయూ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో  చింతపల్లి పోలీసులు మండలంలోని బిజెపి, బిజెవైఎం నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, మండల అధ్యక్షులు శివర్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్ట్ లో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, సుమారు ఆరు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న స్కాలర్షిప్, స్టైఫండ్ విడుదల చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.  కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు నమ్మబలికి ఉచిత హామీల పేరుతో యువతను, తెలంగాణ ప్రజలను మోసం చేసి సీఎం కూర్చిపై గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గుర్తుంచుకో తెలంగాణ అడ్డ పోరాటాల గడ్డను అక్రమ అరెస్టులతో నిలువరించాలనే మూర్ఖపు ఆలోచన అరచేతులతో సూర్యుని ఆపడం లాంటిదే తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నిరుద్యోగుల పక్షాన పోరాటానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, మండల అధ్యక్షులు శివర్ల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల నగేష్, మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేష్, గజ్జె అభినవ్, కుందేళ్ళ శ్రీశైలం, మొగిలమోని మల్లేష్, మొగిలమోని రవి, పాలకూర రాజు, గడ్డి మహేందర్ తదితరులు ఉన్నారు.

Read More పేటలో ఘనంగా సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు