రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా రైతు ఋణ మాఫీ ప్రక్రియ పూర్తి చేయాలి

రైతులకు ఇబ్బందులు తలెత్తితే గ్రీవెన్స్ పోర్టల్ ద్వార పరిష్కారానికి చర్యలు

WhatsApp Image 2024-07-18 at 14.50.43_15c7a45b

విశ్వంభర భూపాలపల్లి జూలై 18 : - రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఋణ మాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో రైతు రుణమాఫీ ప్రక్రియపై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై
వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో   సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 16,502 మంది రైతులకు రైతు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. 
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. మొదటి విడత రుణమాఫీలో భాగంగా ఒక లక్ష రూపాయలు లోపు బకాయిలు ఉన్న రైతుల  ఖాతాలలో డబ్బు జమ అవుతుందని తెలిపారు.రెండవ విడత ఈ నెల 31 నుండి ప్రారంభం అవుతుందని అన్నారు.
బ్యాంకర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రుణమాఫీ ప్రక్రియ కొనసాగించాలని అన్నారు.  రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు.  రైతులకు  ఇచ్చిన రుణ వివరాలు, రుణమాఫీ జరిగిన తరవాత మిగిలిన రైతుల వివరాలు కూడా సేకరించాలని,  
ఋణ మాఫీ వచ్చిన వారి వివరాలు, రాని వారి వివరాలు పక్కగా ఉండాలన్నారు.
భ్యాంకులలో ప్రత్యేక సమయం, ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
రైతు ఋణ మాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు,  బ్యాంకర్లు పాల్గొనాలని సూచించారు. 
బకాయిలు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండులక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని,  రైతులు రుణమాఫీకి దరఖాస్తు చేసేప్పుడు తప్పకుండా పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంక్ పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను జతపరచాలని ఆయన  పేర్కొన్నారు.
2023 డిసెంబర్ 09 వ తేది వరకు బ్యాంకుల్లో పంట ఋణాలు తీసుకుని ఇప్పటి వరకు తిరిగి చెల్లించని రైతులకు ఋణ మాఫీ ఉంటుందని తెలిపారు.
గ్రామ, మండల, జిల్లా స్థాయి లో ఋణ మాఫీకి సంబంధించి అర్హుల యొక్క జాభితా వ్యవసాయ శాఖ ద్వారా బ్యాంకులకు తెలియపరచడం జరుగుతుందని అన్నారు. రుణమాఫిలో  సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగిందని,  రైతులకు ఇబ్బందులు తలెత్తితే గ్రీవెన్స్ పోర్టల్ లో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, లీడ్ బ్యాంక్ అధికారి తిరుపతి,వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ బ్రాంచి మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు.. బీజేపీ సంచలన ఆరోపణలు