రైస్ మిల్లు డ్రైవర్ ల వేతన అలవెన్సులను తక్షణమే పెంచాలి:టీయన్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి
On
హుజూర్ నగర్ రైస్ మిల్లు డ్రైవర్ ల వేతన అలవెన్సులను తక్షణమే పెంచాలని టీయన్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు.
విశ్వంభర, హుజూర్ నగర్: హుజూర్ నగర్
హుజూర్ నగర్ బుధవారం రాత్రి రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీనరసింహారావు కు రైస్ మిల్ డ్రైవర్ లు రెండవ
నోటీసు ఇచ్చారు. అనంతరం రోషపతి మాట్లాడుతూ అగ్రిమెంట్ 31 అక్టోబర్ 2024 నాటికి పూర్తి అయినందున తిరిగి అగ్రిమెంట్ చేయక పోవటం విచారకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు గుండేబోయిన వెంకన్న, రామయ్య, శ్రీను, అంజయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.