పదవి విరమణ సందర్బంగా ఎస్.ఐ వెంకటరాములుకు ఘనంగా సన్మానం
పదవి విరమణ సందర్బంగా ఎస్.ఐ వెంకటరాములుకు ఘనంగా సన్మానం
విశ్వంభర, మహబూబాబాద్: పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ప్రస్తుతం మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తు పదవీ విరమణ పొందిన ఎస్ఐ పి. వెంకటరాములు జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య వారిని శాలువా,పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్ఐ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు, రూరల్ సీఐ శరవయ్య, ఆర్.ఐ అడ్మిన్ అనిల్, రూరల్ ఎస్.ఐ దీపిక,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.