5 వ, జె.ఐ.ఏ.ఎం.ఎస్.ఎం.ఈ ఎక్సపో:
5 వ, జె.ఐ.ఏ.ఎం.ఎస్.ఎం.ఈ ఎక్సపో
విశ్వంభర, కుత్బుల్లాపూర్
: జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదవ జె.ఐ.ఏ
యమ్.యస్.యమ్.ఈ ఎక్సపో. జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యాలయం లో గాంధీజీ విగ్రహానికి
పూల మాలవేసి జ్యోతి ప్రజ్వలన వేసి ప్రదర్శన శాలను ఘనంగా నిర్వహించారు.
ఈ ఎక్స్పో లో వివిద
విభాగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు పాల్గొని వారి వారి ఉత్పత్తులు స్టాల్స్ లో ప్రదర్శించారు.
నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఎక్స్పో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గత 5 సార్లు గా జరుపు
కుంటున్నామని ప్రతి పారిశ్రామిక వేత్తలు పాల్గొని, ఒక వస్తువు తశయారి,ముడి సరుకులు, మార్కెటింగ్,
ప్యాకేజీ తదితర అంశాలపై ఈ ఎక్స్పో స్టాల్స్ ద్వారా తెలియ జెస్తోంది అని మనకు మన ప్రక్కన ఉండే
పరిశ్రమ వివరాలే మనకు తెలియకుండా ఉంటుదని కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి
చూడాలని, అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ ఎక్స్పో మూడు
రోజులు నవంబర్ 28,29,30 తేదీ లలో జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిది గా యస్.విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అండ్ హెచ్‌ఓడీ, మినిస్టరి ఆఫ్ ఎంఎస్‌ఎంఈ
పాల్గొన్నారు. వారితో పాటు అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయి కిషోర్, కోశాధికారి
దుర్గయ్య గౌడ్ పాల్గొన్నారు.