మాలల సింహ గర్జన సభ ను విజయవంతం చేద్దాం:డివిజన్ అధ్యక్షుడు జగన్

మాలల సింహ గర్జన సభ ను విజయవంతం చేద్దాం:డివిజన్ అధ్యక్షుడు జగన్

మాలల సింహ గర్జన సభ ను విజయవంతం చేద్దాం

విశ్వంభర, ఎల్బీనగర్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1 ఆదివారం జరిగే మాలల సింహ గర్జన సభ ను విజయవంతం చేద్దామని ఆర్కే పురం డివిజన్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ముచ్చింతల  జగన్, ఉపాధ్యక్షుడు వానపోస వెంకటేష్ లు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ రామకృష్ణాపురం డివిజన్ నుండి వేలాదిమంది మాల కులస్తులను, మాల ఉద్యోగులను,  మాల సంఘాల విద్యార్థులను, యువకులను పెద్ద ఎత్తున తరలిస్తామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఉపయోగపడ్డ మాలలు కావాలా... భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించమని, బహిరంగంగా ప్రచారం నిర్వహించిన మందకృష్ణ కావాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని అని అన్నారు.డిసెంబర్ ఒకటో తేదీన జరిగే మాలల సింహగర్జన చారిత్రాత్మకమైనదని. తెలంగాణలో ఉన్న మాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు అందరు కూడా కలిసికట్టుగా వర్గీకరణకు వ్యతిరేకంగా  ఉద్యమిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలను అణచివేయాలని చూస్తున్నారని. ఇది మన సమాజం గమనిస్తున్నదని. ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని మనవాదులు చేస్తున్న కుట్రలో మందకృష్ణ పావుగా వాడుకొని ఎస్సీలకు రిజర్వేషన్ లేకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఇది మాల మాదిగలు గ్రహించాలని అని అన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ మీద తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags: