ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి:మాజీ సర్పంచ్ ఉజ్జిని నరేందర్ రావు
On
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి
విశ్వంభర, చింతపల్లి:విధుల్లో చేరిన నాటి నుంచి అహర్నిశలు కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉజ్జిని నరేందర్ రావు పేర్కొన్నారు. చింతపల్లి మండలం గడియ గౌరారం గ్రామానికి చెందిన ఉజ్జిని శ్రీధర్ రావు నాగర్ కర్నూల్ జిల్లాలో ఇరిగేషన్ ఈఈ గా ఉద్యోగం చేస్తూ శనివారం పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉజ్జిని నరేందర్ రావు పాల్గొని మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ ఈఈ అధికారిగా ఉజ్జిని శ్రీధర్ రావు తనకు కేటాయించిన విధుల పట్ల నిబద్దతో పనిచేశారని, ఇరిగేషన్ శాఖ సిబ్బందితో స్నేహభావంగా ఉంటూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించేలా పర్యవేక్షించారన్నారు. ఆయన వెంట ఉజ్జిని రఘు రామారావు, ఆదిరాల కృష్ణయ్య, కంబాలపల్లి సైదులు ఉన్నారు.