పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్: జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
On
పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ విభాగం నందు సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆకాలంగా మరణించడం జరిగినది. ఇతని కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత స్కీమ్ ద్వారా 8 లక్షల రూపాయల చెక్కును ఈరోజు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జిల్లా పోలీసు కార్యాలయం నందు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది. భద్రత పథకం సిబ్బంది కుటుంబాలకు బాసటగా ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమం నందు అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఓ మంజు భార్గవి, పోలీసు సమంఘం సెక్రెటరీ వెంకన్న, సెక్షన్ సూపరింటెండెంట్ విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.