డిగ్రీ కళాశాలకు చైర్లు, ఇతర సామాగ్రి బహుకరణ
డిగ్రీ కళాశాలకు చైర్లు, ఇతర సామాగ్రి బహుకరణ
విశ్వాంభర, పరిగి: పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మంజూర అయింది. కానీ ఎలాంటి వసతులు లేక
ఫ్యాకల్టీ ఇబ్బందులు పాలవుతున్న సమయంలో పరిగి మండల పరిధిలోని బసిరెడ్డి పల్లి గ్రామానికి
చెందిన డీసీసీ సెక్రెటరీ రామచంద్రయ్య యాదవ్ యొక్క గురువు ఎకనామిక్స్ నరసింహారెడ్డి కలిసి పరిగి
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గురువారం ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు
చైర్లు, ఇతర సామాగ్రి తన సొంత డబ్బులతో ఇవ్వడం జరిగింది. దీంతో డిగ్రీ కళాశాల అధ్యాపకులు
రామచంద్రయ్య యాదవ్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్
పరశురాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ
నాయకులు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, మైపాల్, రాజ పుల్లారెడ్డి,చిన్న నరసింహులు, వెంకటేష్,
సత్యనారాయణ, శివకుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.