ఈ నియామకాలనూ రేవంత్ తన ఖాతాలో వేసుకుంటారేమో!: హరీశ్‌రావు
On
* విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లకు హరీశ్‌రావు శుభాకాంక్షలు
విశ్వంభర, హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోలీసు పరీక్షల్లో ఎంపికై, ఉద్యోగాలు పొంది 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్న 8,047 పోలీసు కానిస్టేబుల్‌లకు మాజీ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తూ, శాంతి భద్రతలు కాపాటంలో నిమగ్నం కావాలని, ఉద్యోగ నిర్వహణలో రోల్ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే పది నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి.. ఇవి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు.