విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..

విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..

పెండింగ్లో 8 వేయిల కోట్ల  ఉన్న స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్  వెంటనే విడుదల చేయాలి.

జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు.

భారతీయ విద్యార్థి మోర్చ  ఆధ్వర్యంలో బడ్జెట్ పాత్రలను దహనం చేయడం జరిగింది.

భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం. విఠల్ 

WhatsApp Image 2024-07-27 at 15.22.44_41fea85d27 జూలై 2024 విశ్వంభర : - విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని భారతీయ విద్యార్థి మోర్చ BVM రాష్ట్ర కార్యదర్శి అన్నారు.
సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి 8,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇలా తక్కువ నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసి కుట్ర పన్నుతున్నారాని అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది అన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం 7.30 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,గురుకులలు, కళాశాల నుంచి యూనివర్సిటీ దాకా సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. గురుకులలు కిరాయి భవనాలలో నడిపిస్తూ విద్యార్థులకు  సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పడం సరికాదన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.WhatsApp Image 2024-07-27 at 15.22.44_3cd667b6
ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా నాయకులు యోగేష్ సాయి తేజ పట్టణ నాయకులు చరణ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.