దళిత ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య కు కారణమైన సీఐ మరియు సిబ్బందిని సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి

 

 కులవివక్ష వేధింపులతో మృతి చెందిన ఎస్ఐ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి...

ఎస్.ఐ ఆత్మహత్యపై సీఎం, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోని సమగ్ర విచారణ జరపించాలి...

పోలీసు వ్యవస్థలో జరుగుతున్న కుల వివక్షతను అరికట్టాలి...

 మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్ ..
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి.. 

WhatsApp Image 2024-07-08 at 4.14.21 PM
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సిఐ మరియు సిబ్బందిని తక్షణమే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లు జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది, తళ్లమల్ల హసేన్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపీలు డిమాండ్ చేశారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్, మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సై ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సీఐ జితేందర్ రెడ్డి మరియు తోటి సిబ్బంది వేధింపుల వల్లనే  ఎస్సై శ్రీరాముల శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని అన్నారు. సీఐ మరియు కానిస్టేబుల్ ల  వేధింపులపై డీఎస్పీ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసిన.పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు.జిల్లా పోలీస్ అధికారులు శాఖా పరంగా తీసుకోవలసిన చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఒక ఉన్నత భవిష్యత్తు కలిగిన దళిత ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనకు 
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. డిప్యూటీ సీఎం మరియు ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లు 
ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇట్టి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి,తుమ్మల జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసు వ్యవస్థలో అంతర్లీనంగా కొనసాగుతున్న కుల వివక్షను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు పోలీసు ఉన్నత అధికారులపై ఉందని అన్నారు. దళిత ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఉన్నత హోదాలో ఉన్న పోలీస్ అధికారులే చట్టాలు అమలు చేయాల్సి ఉండగా ఆ శాఖలో పని చేస్తున్న ఎస్ఐనే 
కులం పేరుతో వేధింపులకు గురి కావడం సిగ్గుచేటన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొయిళ్ల అఖిల్,ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్ నాయక్ సమతా సైనిక్ దళ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎలిజాల సురేష్, కెవిపిఎస్ జిల్లా నాయకులు చిన్నపంగి నరసయ్య,వేల్పుల వెంకన్న, దయానంద్,సతీష్, న్యాయవాది ఎడిండ్ల అశోక్, మాల మహానాడు జిల్లా నాయకులు పిండిగ అశోక్,ఎడ్ల కళ్యాణ్  తదితరులు పాల్గొన్నారు.