రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

WhatsApp Image 2024-07-19 at 13.33.16_8bd58cea

విశ్వాంబర, ఆమనగల్లు,జులై 19 :- రైతుల రుణమాఫీపై మాట ఇచ్చాం ఇపుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన సందర్భంగా శుక్రవారం తలకొండపల్లి మండలంలోని మెదక్ పల్లి,గట్టిఇప్పల పల్లి, చౌదర్ పల్లి గ్రామపంచాయతీ లలో రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారుWhatsApp Image 2024-07-19 at 13.33.14_fe3a05a0,ఈ సందర్భంగా  ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేశారని అన్నారు, రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ మిత్తిలకు కూడా సరిపోలేదని, విమర్శించారు,ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కిసాన్ సెల్ మోహన్ రెడ్డి, జంగారెడ్డి, రేణు రెడ్డి, రైతులు, ప్రజాప్రతినిధులు.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమకాలిన సమస్యల పరిష్కారంపై సమీక్ష