టెట్ ఫలితాలు విడుదల.. డీఎస్సీ 2024కి ఉచితంగానే దరఖాస్తుల స్వీకరణ..!

టెట్ ఫలితాలు విడుదల.. డీఎస్సీ 2024కి ఉచితంగానే దరఖాస్తుల స్వీకరణ..!

 

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో వీటిని విడుదల చేశారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌ 1 పరీక్షకు 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో ఉత్తీర్ణత శాతం 67.13%గా నమోదైంది. 

Read More రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకే మా పోరాటం:ధర్మ సమాజ్ పార్టీ 

ఇక పేపర్-2 ఎగ్జామ్ కు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18% మాత్రమే ఉన్నారు. తెలంగాణ టెట్-2024కు 2,86,381 మంది అప్లై చేసుకున్నారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 2023తో పోలిస్తే పేపర్-2లో కూడా 18.88% పెరిగింది అర్హత శాతం. 

ఇక ఈ టెట్ లో అర్హత సాధించిన వారికి తర్వాత వచ్చే టెట్ కు ఉచితంగానే అప్లై చేసుకునే వెసలుబాటు కల్పిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా ఇప్పుడు టెట్ అర్హత సాధించిన వారిక డీఎస్సీ-2024కి కూడా ఉచితంగానే అప్లై చేసుకునే వెసలుబాటు కల్పించారు సీఎం.