తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు.

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఈనెల 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టు లకు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్దతిలో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటల తరువాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. 

Read More అవోప ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్

బయో మెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టంచేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంటకోసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని, అవసరమైతే అభ్యర్థులు ఇన్విజిలేటర్ ను అడిగి సమయం తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేరును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.