శైలజా రామయ్యర్ ను కలిసిన చేనేత నాయకులు,పోచంపల్లి టై & డై , పోచంపల్లి కో ఆపరేటివ్ బ్యాంకుల  చైర్మన్ తడక రమేష్ 

శైలజా రామయ్యర్ ను కలిసిన చేనేత నాయకులు,పోచంపల్లి టై & డై , పోచంపల్లి కో ఆపరేటివ్ బ్యాంకుల  చైర్మన్ తడక రమేష్ 

బడ్జెట్ లో చేనేత  కార్మికులకు 1000 కోట్లు కేటాయించాలి 

 

హైద్రాబాద్, విశ్వంభర :-ప్రముఖ చేనేత నాయకులు,పోచంపల్లి టై & డై , పోచంపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు ల  చైర్మన్ తడక రమేష్ చేనేత  కార్మికుల సమస్యలను త్వరితగతిన  పరిష్కరించాలంటూ  ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ను కలిసి వినతి పత్రం అందించారు . చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా పిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ తో కలిసి మాట్లాడటం జరిగింది . ఈ సందర్బంగా తడక రమేష్ పలు సమస్యల  తో కూడిన చేనేత పొదుపు చేనేత మిత్ర నేతన్న పథకాలను అమలు చేయాలని, బడ్డేట్లో చేనేతకు 1000 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు సహకార మరియు సహకారేతర  రంగంలోని స్టాకు లకు ఖరీదు చేసి  డబ్బులు చెల్లించాలి. అలాగే  ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకంలో పోచంపల్లి పట్టుచీరలను అందించాలి . పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కులో కొంత భాగం చేనేత ప్రయోగాలుగా మార్చి మిగతా భాగంలో పూర్తిస్థాయిలో మగ్గాలను ఏర్పాటు చేసి పని కల్పించాలి. IIHT ని  పోచంపల్లిలో ఏర్పాటు చేయాలి.  చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.  చేనేత కార్మికునికి సంవత్సరం మొత్తం పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను పైన పేర్కొన్న ప్రధాన డిమాండ్ లను  పరిష్కరించి చర్యలు చేపట్టాలని కోరారు. 

Read More స్మార్ట్ ఫోన్లు - సైబర్ నేరాలు

 

Tags: