వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు

వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు

 

సూర్యాపేట,విశ్వంభర :-వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేద మహిళలకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని బాలాజీ ఫంక్షన్ హాల్లో నూతన పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీమంతాలు నిర్వహించారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ గోరింటాకు మహోత్సవ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి మాట్లాడుతూ గర్భవతి అయిన మహిళలకు శ్రీమంతం వేడుక ఎంతో ఆనందం కలిగించడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. వాసవి వనీత క్లబ్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా ఎన్నో సేవా కార్యక్రమా లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పలువురు దాతలను సన్మానించారు. కోలాటాలు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో  వాసవి నేషనల్ సెక్రటరీ పబ్బతి  వేణుమాధవ్ ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య జాయింట్ సెక్రెటరీ బిక్కు మల్ల కృష్ణ. ఐపిసి గుండా ఉపేందర్ వనిత క్లబ్ ఆర్ సి గుoడా సుధా మాధురి  వాసవి క్లబ్ జెసి పసుపర్తి  కృష్ణమూర్తి ఐపిసిలు తల్లాడ సోమన్న రాచకొండ శ్రీనివాస్ ఆర్సీలు మిరియాల వెంకటేశ్వర్లు  మిట్టపల్లి రమేష్,  బెల్దే శ్రీనివాస్ గునుగుంట్ల విద్యాసాగర్, వాసవి వనిత క్లబ్ సెక్రటరీ వెంపటి విజయ ట్రెజరర్ నల్లపాటి రమాదేవి ఫాస్ట్ ప్రెసిడెంట్లు,  అన్ని క్లబ్బుల ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు,దాతలు,  500 మహిళలు పాల్గొనడం జరిగింది.

Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ