సర్వేంద్రియానం నయనం ప్రదానం
On
టీజేయూ మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ రెడ్డి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 23 : - యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం నాంచారి పేట గ్రామంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రదానం అని పెద్దలు చెప్పిన మాట ప్రకారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబా ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ కేంద్రంలోని సుమంత్ కంటి హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి టీ జే యూ ప్రతినిధులు విచ్చేసి కంటి వైద్య నిపుణుల పర్యవేక్షణలో కండ్లను టెస్టింగ్ చేపించుకుని మందులు , అద్దాలు తీసుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా టీ జే యూ కుటుంబ సభ్యులకు , టీ జే యూ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు కి , జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబాకి ధన్యవాదాలు తెలిపారు