గ్రేటర్ ఈస్ట్ లో నిర్మాణ రంగానికి అనుకూల అవకాశాలు
ఐ జి బి సి శేఖర్ రెడ్డి.
విశ్వంభరా, ఎల్బీనగర్ : - గ్రేటర్ ఈస్ట్ లో నిర్మాణ రంగానికి అనుకూల అవకాశాలు ఉన్నాయని ఐ జి బి సి శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్కే పురం లోని టిఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ లో
గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ యూత్ వింగ్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధి లుగా ఐజిబిసి సి.శేఖర్ రెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు ,సాగర్, క్రెడాయ్ ఈసీ మెంబర్ మురి శెట్టి శ్రీనివాస్ లు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో కొత్తగా వస్తున్న సెకండ్ జనరేషన్ వారికి యూత్ వింగ్ లాంచ్ ద్వారా అనేక విషయాలు తెలుసుకొని నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు కనుగుణంగా వారు కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. అతి తక్కువ ధరలోనే నాణ్యమైన నిర్మాణాలు వినియోగదారులకు అందించేందుకు ఇలాంటి ప్లాట్ఫారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిర్మాణ రంగంలోకి కొత్తగా వచ్చే వారికి సిమెంట్, స్టీల్ లాంటి ధరలు తేడాలో వ్యత్యాసం ఉండి నష్టపోకుండా ఉండేందుకు ఈ యూత్ వింగ్ లాంచ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకరి అనుభవాలు మరొకరు పంచుకునేందుకు ఈ ప్లాట్ఫారం తోడ్పడుతుందని తెలిపారు.
అనంతరం యూత్ వింగ్ అధ్యక్షునిగా టి విక్రమ్, జనరల్ సెక్రటరీగా మేఘన, ట్రెజరర్ గా అక్షయ్ సాదును ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ టిఎన్ఆర్ గ్రూప్ టి నరసింహారావు, అధ్యక్షుడు మారం సతీష్ కుమార్, జనరల్ సెక్రెటరీ మల్కాజ్గిరి రవీంద్ర కుమార్, ట్రెజరర్ పి ఉపేందర్, ఉపాధ్యక్షులు బి. పాండురంగారెడ్డి, ఎం శ్రీకాంత్, సి శ్యామ్ కిరణ్, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.