ఆయిల్ ఫామ్ మొక్కలు రైతులకు లాభదాయకం-ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

10విశ్వంభర, ఆమనగల్లు/కల్వకుర్తి, జూలై 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన రైతు అయినందున రైతుల కోసం  కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆయిల్ ఫామ్ మొక్కలను అందించి లాభాల బాటలో పాయనించేందుకు కృషి చేస్తోంది అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయ రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టంలో వనమహోత్సవం సందర్భంగా మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో  భాగంగా సత్యనారాయణ  వ్యవసాయ క్షేత్రంలో కల్వకుర్తి ఎమ్మెల్యే  కసిరెడ్డి నారాయణరెడ్డి  ఆయిల్ పామ్ మొక్కను నాటడం జరిగింది. ఆయిల్ పామ్ పంట ఒకసారి నాటుకుంటే నాలుగో సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు రైతుకు స్థిరమైన ఆదాయం వస్తుంది . చీడ, పీడల బెడద తక్కువగా ఉంటుంది ని అకాల వర్షాలు వడగండ్లు ఈ పంటపై ఎలాంటి ప్రభావం చూపదు అని అంతర పంటలతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అని ఎమ్మెల్యే అన్నారు.  ఆయిల్ పామ్ చట్టం 1993 ప్రకారం ఈ పంటను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారము ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ పంట టన్ను ధర కూడా ప్రతినెల ప్రభుత్వమే నిర్ణయించడం జరుగుతుంది అని ఈ పంట ఒక మొక్క పూర్తి ధర 193 రూపాయలు కానీ ప్రభుత్వం కేవలం 20 రూపాయలకే రైతులకు సబ్సిడీ రూపంలో అందిస్తుంది అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజి సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్  జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీ డి చక్రపాణి  కల్వకుర్తి ఉద్యాన అధికారి  ఇమ్రాన ,ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గోన్నారు