మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ సంచలన నిర్ణయం

మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ సంచలన నిర్ణయం

నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుంచి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బీఆర్ఆర్ ప్రకటించారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుంచి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

గతంలో జీతాలు ఇవ్వలేక విద్యాశాఖ స్వీపర్లను పక్కన పెట్టిందన్నారు. తన ఎమ్మెల్యే పదవి ఉన్నంత కాలం స్వీపర్లకు జీతాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తానని స్పష్టం చేశారు. వారంలో మూడు రోజులు ఊరు, వాడ,  తండా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.

Read More జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు.. బీజేపీ సంచలన ఆరోపణలు