పిడిఆర్ ప్లానర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేఎల్ఆర్, భాస్కర్ రెడ్డి.
ఘనంగా పిడిఆర్ ప్లానర్స్ ప్రారంభం
విశ్వంభరా ,ఎల్బీనగర్ : - కొత్తపేట లక్ష్మీ నగర్ కాలనీలో ఆర్కే పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పిడిఆర్ అసోసియేట్స్, పిడిఆర్ ప్లానర్స్ నూతనంగా ఏర్పాటు చేశారు. శనివారం మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పిడిఎఫ్ ప్లానర్స్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పిడిఆర్ ప్లానర్స్ ద్వారా ఉత్తమ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి,
డిసిసి మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేష్ గౌడ్, నాయకులు బండ మధుసూదన్ రావు, గడ్డం లక్ష్మీనారాయణ, రవితేజ, జగన్నాథం, ధన్ రాజ్ గౌడ్, గోపాల్ రెడ్డి, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.