మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
On
24 జులై 2024 విశ్వంబర మెట్పల్లి : - మెట్పల్లి పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం సమర్పించిన గంగా పుత్రులు మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో బెస్త మరియు గుండ్ల కులాలకు చెందిన గంగపుత్రులు ఆషాడ మాస గురు పౌర్ణమి తర్వాత వచ్చు బుధవారం రోజు మహాలక్ష్మి అమ్మవారికి బోనం ముస్తాబు చేసిన వలగొల్లల తో డప్పు చప్పులతో ఊరేగింపుగా వచ్చి మొక్కులను సమర్పించుకుంటారు పంటలు బాగా పండాలని .చెరువులు నిండి మచ్చ సంపద అభివృద్ధి చెందాలని. ప్రజలకు విష జ్వరాలు సోకకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మహాలక్ష్మి అమ్మవారికి మొక్కలు చెల్లిస్తారు గంగపుత్ర సంఘం అధ్యక్షులు ప ర్రె శంకర్. ఆర్మూర్ నరేందర్. ఆర్మూర్ రంజిత్. దుబ్బ రాజయ్య .పారుపల్లి శంకర్. సాయిలు. సురేష్. మగ్గిడి ప్రదీప్. పర్రె రాజకుమార్. తదితరులు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారికి మొక్కులు నిర్వహించారు.