మాల సోదరులు భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి: బోరెల్లి సురేష్
విశ్వంభర, ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మాలలు మద్దతు పలికి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ అన్నారు. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని,అందుకు మాలలు మాదిగలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలకాలని ఎవరి జనాభా ఎంత ఉంటే వారికంత రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆవరణంలో ఉన్న భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోరెల్లి సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ 75 వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మాదిగల అస్తిత్వ ఉద్యమానికి మాలలు మద్దతు ప్రకటించి మాల మాదిగల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని అన్నదమ్ముల రాజ్యాంగ ఫలాలు పంచుకోవాలని అన్నారు. ఇంతకుముందు ఉషామహర కమిషన్ కూడా రాజ్యాంగ విలువలకు లోబడి ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే తీర్పు మాల సోదరులు గుర్తు చేసుకోవాలని అన్నారు. 2004 చెన్నయ్య కేసు లో కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం మాలలు మద్దతు మాదిగలకు ఇవ్వాలని అన్నారు. భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలలు స్వాగతించి మద్దతు ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి అరె కంటి శ్రీకాంత్, నాయకులు సందీప్, వెంకటేష్, రమాకాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.