నేడు నల్లగొండలో చేపట్టే దీక్షా దివస్ ను విజయవంతం చేయాలి: రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

నేడు నల్లగొండలో చేపట్టే దీక్షా దివస్ ను విజయవంతం చేయాలి: రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

నేడు నల్లగొండలో చేపట్టే దీక్షా దివస్ ను విజయవంతం చేయాలి

విశ్వంభర, నార్కెట్ పల్లి: శుక్రవారం నల్లగొండలో చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నల్లగొండ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం నాడు నార్కట్ పల్లి వివేరా హోటల్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  తన ప్రాణాలకు తెగించి ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పారని అన్నారు. ఆయన చేపట్టిన దీక్షకు దిగివచ్చిన కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసిందని అన్నారు. కాబట్టి దానిని గుర్తు చేసుకుంటూ 29వ తేదీని దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పట్టు వదలని విక్రమార్కుడిలా కేసీఆర్ యావత్‌ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమస్ఫూర్తిని ప్రతీ తెలంగాణ పౌరుడిలో నింపాల్సిన భాద్యత మనందరిపై ఉన్నదని వారు అన్నారు, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త భాద్యతగా శుక్రవారం నల్లగొండలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Tags: