రైతులకు సకాలంలో సాగు నీరు అందించాలి

 

...పల్లా నరసింహారెడ్డి

 
WhatsApp Image 2024-07-23 at 17.47.14_fe2eaa65
విశ్వంభర చింతపల్లి జులై 23 : - అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చింతపల్లి మండల పరిధిలోని పి.కె మల్లేపల్లి గ్రామంలో వింజమూరి అనంతలక్ష్మి  అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా పల్లా నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వం సరైన ప్రణాళికా లేకుండా ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించి, బీడు భూములను సస్యశ్యామలం చేయాలని కోరారు. షరతులు లేకుండా కట్ ఆఫ్ తేదీలను ఉపసంహరించుకొని రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేసి, పార్టీలకు అతీతంగా అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలము అందించాలన్నారు. అర్హులైన వారికి పింఛన్లను, ఇండ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే ఎర్రజెండాను గ్రామ గ్రామాన ఎగరవేసి భవిష్యత్తులో, కమ్యూనిస్టు పార్టీ నిర్వహించబోయే పోరాటాలకు ప్రజలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, మండల కార్యవర్గ సభ్యులు సాంభా శంకర్, గ్రామ శాఖ కార్యదర్శి ఐతపాక సైదులు, సహాయ కార్యదర్శి ఘనిపల్లి జితేంద్ర,  శ్రీకృష్ణ, మల్లయ్య, రామకృష్ణ, కిష్ణయ్య, మల్లయ్య, జంగయ్య, విష్ణు, గోపాల్, లచ్చయ్య, దశరథం, బిక్ష్మయ్య,  కొండయ్య, రామచంద్రం, లక్ష్మమ్మ, పర్వతాలు, యాదయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు