మానవ మనుగడకు మొక్కల పెంపకం అవసరం -మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహా రెడ్డి

WhatsApp Image 2024-07-22 at 16.56.06_90514e0f

విశ్వాంబర, కడ్తాల్, జూలై 22 : - మానవ మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.  ఈరోజు ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఒడిశా స్పీకర్ సురమా పాది మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి చేతుల మీదుగా భువనేశ్వర్ లో ప్రారంభించడం జరిగిందని వారి పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని కోరారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో బాలుర ప్రభుత్వ పాఠశాలలో  ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం లక్ష్మీ నరసింహా రెడ్డి మాట్లాడుతూ భారాసా ప్రభుత్వ హయాంలో గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామపంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేసి నిర్దిష్ట కాలవ్యవధిలో,ఉద్యమ స్ఫూర్తితో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి భారత దేశంలో రికార్డు సృష్టించిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ప్రధానోపాధ్యాయులు జంగయ్య,ఉపాధ్యాయులు రాధాకృష్ణ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, మాజీ వార్డు సభ్యులు గురిగల్ల జంగమ్మ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-07-22 at 16.56.05_964a8abe

Read More సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల