సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదు.. అత్యుత్సాహం చూపారంటూ?
తెలంగాణలో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఊహించిన విధంగా హస్తం పార్టీ అధికారం అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణలో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఊహించిన విధంగా హస్తం పార్టీ అధికారం అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి తెలంగాణ బాధ్యతలను తీసుకున్నారు. అయితే ఈయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ హామీ పథకాల కారణంగానే అధికారంలోకి వచ్చారని తెలుస్తుంది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గురించి బీజేపీ రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కాకుండా అత్యుత్సాహంతో ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు. అయితే ఈ హామీలను నెరవేర్చకపోతే ఆయనకు రైతులకు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కాకుండా అత్యుత్సాహంతో ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు.
ఇక రైతు రుణమాఫీ కనక చేయకపోతే ఆగస్టులో సంక్షోభం తప్పదని తెలిపారు. అప్పు తెచ్చి రాష్ట్రానీ నడిపించాలనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం కావడం ఖాయం అంటూ ఈ సందర్భంగా లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి.