ప్రమాదాలకు నిలయంగా మారిన చటన్ పల్లి రైల్వే గేట్ రోడ్డు

ప్రమాదాలకు నిలయంగా మారిన చటన్ పల్లి రైల్వే గేట్ రోడ్డు

నిర్మాణం మరమత్తులు పూర్తి చేయాలని వాహనదారులు విజ్ఞప్తి

WhatsApp Image 2024-07-26 at 14.23.13_bbd59f6f

విశ్వంభర న్యూస్ : - రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి వెళ్లే రహదారి నుండి నిత్యం వేలాదిగా వాహనదారులు,ప్రయాణికులు, కాలినడకన వెళ్లేవారు నిత్యం వేల కొద్ది రాకపోకలు కొనసాగిస్తున్న తరుణంలో గుంతల మయంగా మారినా రోడ్డుతో ప్రమాదాలకు నిలయంగా మారింది.ఈ రోడ్డు నుండి హైదరాబాద్, ప్రధాన బైపాస్ వైపు వెళ్ళడానికి ప్రదానంగా ఉంది.నిత్యం విద్యార్థులు,ఉద్యోగులు,కార్మికులు, పాఠశాలల బస్సులు,సుదీర్ఘ ప్రాంతాల నుండి షాద్ నగర్ చటాన్ పల్లి  తరలివస్తున్న క్రమంలో గుంతల మయంగా మారిన బురద రోడ్డుతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.సకాలంలో విధులకు చేరుకోలేక పోతున్నామని తమ గోడును వేలబోసుకుంటున్నారు.భారీ తరహా చిన్న తరహా వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణించే క్రమంలో పాడైపోయి తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డు భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయని, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి ప్రయాణ యోగ్యంగా మార్చాలని వాహనదారులు విద్యార్థులు కోరుచున్నారు.WhatsApp Image 2024-07-26 at 14.23.14_9a2a804d

Read More రైతుకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం: ⁠కే ఎల్ ఆర్