ఘనంగా డాక్టర్స్ డే - గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద వృద్దులకు నిత్యావసర సరుకులు పంపిణి

గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ - ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్ - డా. కోడి శ్రీనివాసులు 

 sdsds

వైద్యో నారాయణ హరిః ఏ జీవికైనా ప్రాణం పోసేదిఅమ్మ, అదే జీవి అనారోగ్యం పాలైతే ఔషదాన్ని ఇచ్చి పునర్జన్మను ప్రసాదించేది వైద్యుడు అని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. సోమవారం నాడు డాక్టర్స్ డే సందర్భంగా స్ధానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్ధానిక డాక్టర్లను ఘణంగా సన్మానించి మాట్లాడారు.  అదే విధంగా రెండు సంవత్సరములు వరకు ప్రతినెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఈ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం సోమవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు ఏడవ నెల డాక్టర్ల చేత పంపిణీ చేపించడం జరిగింది.ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ జీవితంలో మా కుటుంబం సంపాదించిన సంపాదనలో కొంత శాతం నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, మా కుటుంబ సభ్యులంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు మా గాంధీజీ ఫౌండేషన్ తీసుకువస్తుందని తెలిపారు. ఉన్నంతవరకు మా కుటుంబం పేదలకు సేవ చేస్తూనే ఉంటుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డాక్టర్ నర్సింహ, డాక్టర్ రవి, డాక్టర్ వెంకట్, డాక్టర్ రాంప్రసాద్, చేనేత పరిరక్షణ సమితి అధ్యక్షులు రాపోలు ప్రభాకర్,డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి, ముషిని సమత, కోడి ప్రీతి, బుషిపాక యాదగిరి, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Read More నాణ్యమైన కోతలు లేని విద్యుత్తును అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం