మంత్రి శ్రీధర్ బాబుతో భేటి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మరియు ఐ.టీ.శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని సచివాలయంలో రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి పలు నిధులు మంజూరు చేయాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని మరో రెండు నూతన ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు. అలాగే నూతన ఎస్.ఎన్.డి.పీ. పనుల నిమిత్తం 100 కోట్ల రూపాయలు,నూతన వాటర్ డ్రైనేజీ పనుల నిమిత్తం మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.
దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి రాజకీయాలకు అతీతంగా పనులు చేయడం జరుగుతుందని అన్నారు. తప్పకుండా మీరు కోరిన అభివృద్ధి పనులకు తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో బండారు లక్ష్మారెడ్డి,మాధవరం కృష్ణ రావు, అరికెపుడి గాంధీ,మర్రి రాజశేఖర్,వివేకానంద పాల్గొన్నారు.