రాష్ట్ర మాజీ మంత్రి , BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ ..
విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 48 వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పార్టీ అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు మరియు మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య పాల్గొని కేకు కట్ చేసి పార్టీ శ్రేణులందరికీ కేకు తినిపించి కేటీఆర్ కి మొగుళ్లపల్లి మండల BRS పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మండల పార్టీ అధ్యక్షులు మరియు మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ
నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగములో కేరాఫ్ అడ్రస్ గా మార్చిన ఘనత కేటీఆర్ దే అని వారు చేసిన సేవలను కొనియాడారు. కేటీఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండి, రాబోయే కాలములో రాష్ట్రాన్ని అభివృద్ది చేసే కార్యక్రమములో కీలక భూమిక పోషించాలని వారి యువ నాయకత్వం భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలుపుతూ మరొక్కసారి కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమములో సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు చదువు అన్న రెడ్డి, మాజీ సర్పంచులు నేనకంటే ప్రభాకర్ రెడ్డి, సూరం నేని రవీందర్రావు, టిఆర్ఎస్ నాయకులు ముడుపు రవీందర్, చెక్క శ్రీధర్, దేవుని కుమార్, నేర్పటి శ్రీనివాస్, జన్నే రాజు, మహమ్మద్ తాజుద్దీన్, మరియు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కేటీఆర్ అభిమానులు, పాల్గొన్నారు.